Deepika Padukone: కల్కి 2 షూటింగ్ పై స్పందించిన దీపికా..! 5 d ago
ప్రభాస్ మూవీ కల్కి 2 షూటింగ్ లో దీపికా పదుకొనే పాల్గొన్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై దీపికా స్పందిస్తూ ఆ కథనాల్లో నిజం లేదని పరోక్షంగా తెలిపారు. ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యత కుమార్తె దువా అని.. పాప సంరక్షణ పక్కన పెట్టేసి వెంటనే వర్క్ లైఫ్ లో బిజీ కావాలనుకోవడం లేదని చెప్పారు. 'తన తల్లి ఎలా అయితే చూసుకున్నారో, అదే విధంగా తాను కూడా తన కూతురిని చూసుకోవాలనుకుంటున్న' అని దీపికా తెలిపారు.